BREAKING
చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చి నామినేషన్ దాఖలు చేసిన జడ్పిటిసి అభ్యర్థి మహాదేవి. ఉత్తరాఖండ్‌కు కళాకారులు రాకూడదనుకుంటున్నారా.. మంత్రి సుబోధ్ ఉనియాల్‌ను నిలదీసిన సింగర్ మికా సింగ్ లండన్ వెకేషన్‌లో అక్షయ్ కుమార్ కుమారుడితో అనన్య పాండే.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్ ఎన్నికల నిర్వహణపై రూట్, జోనల్ అధికారులతో సమావేశం మీ ముందుకు వస్తాను.. మీ సమస్యలు వింటాను.. వాటి పరిష్కారానికి కృషి చేస్తాను.. టైగర్ ష్రాఫ్ పై దాడి ఘటనపై అశోక్ పండిట్ సంచలన వ్యాఖ్యలు.. అందరికీ భద్రత సాధ్యం కాదంటూ స్పష్టీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి 30 మద్యం సీసాలు స్వాధీనం ఐఫా 2027 వేదికపై సల్మాన్ ఖాన్ అల్లరి.. రష్మిక మందన్నాపై సెటైర్లు, వరుణ్ ధావన్‌తో చిలిపి డ్యాన్స్ మండలంలో 109 ఎంపిటిసి నామినేషన్లు బడ్జెట్ లోటు పూడ్చేందుకు ఇటలీలో ఇంధన సంస్థలపై ట్యాక్స్ పెంపునకు కసరత్తు ఏడవ వార్డులో తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం. ప్రమాద రహిత రంగారెడ్డే లక్ష్యం.. రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు 15 ఎంపీటీసీ స్థానాలకు 95 నామినేషన్లు రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికలలో దౌర్జన్యాలు* *వైసీపీ అభ్యర్థులను గెలిపించండి* *మాజీ మేయర్ మహమ్మద్ వసీం*

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి తీవ్ర అస్వస్థత:

Select Suryaa Now
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి తీవ్ర అస్వస్థత:

సూర్య బ్యూరో, కాకినాడ/అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఆయనకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి, తీవ్ర నీరసం రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక వార్డులో అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తోంది.

వైద్యులతో మాట్లాడి ఆరా తీసిన సీఎం చంద్రబాబు:యనమల రామకృష్ణుడు ఆసుపత్రిలో చేరిన సమాచారం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కాకినాడ ఆసుపత్రి వైద్యులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి, యనమల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మరియు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం యనమల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని పార్టీ స్థానిక నేతలకు సూచించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సైతం ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

ఆసుపత్రికి చేరుకున్న ఎంపీ సానా సతీష్ బాబు:ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు హుటాహుటిన కాకినాడలోని ఆసుపత్రికి చేరుకున్నారు. యనమలకు అందుతున్న వైద్య సేవలను ఆయన దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించారు. చికిత్సకు సంబంధించిన తాజా వివరాలపై వైద్యులతో చర్చించారు. కాగా, పార్టీ వ్యవస్థాపక రోజుల నుంచి కీలక నేతగా, మాజీ స్పీకర్‌గా, ఆర్థిక మంత్రిగా సేవలందించిన యనమల అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆందోళనకు గురై పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, మరికాసేపట్లో సమగ్ర హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.