BREAKING
త్రివిధ దళాల సమన్వయంలో సీడీఎస్ కీలక పాత్ర 2047 నాటికి ఆధునిక రక్షణ వ్యవస్థే లక్ష్యం: నితిన్ ఎ. గోఖలే తాగునీటి సమస్యపై బీజేపీ పోరుబాట: జలమండలి అధికారులకు వినతిపత్రం అందజేత.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతల డిమాండ్! కాపులంతా ఎన్డీఏ కూటమి వైపే మంత్రాలయం హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు మూతపడిన ఇండోర్ స్టేడియాన్ని వెంటనే తెరిపించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతి శ్రీకాళహస్తి ప్రాంతంలో ప్రశాంతంగా స్థానిక సంస్థలు ఎన్నికలు నామినేషన్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మణికంఠ మైన్స్‌లో మృత్యుఘోష.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు రేపు రాష్ట్ర మంత్రి ఆత్మకూరు రాక..! పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవానికి ప్రాధాన్యం ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు: 8 జిల్లాల్లో 14 ఘటనలు నమోదు.. డీజీపీ స్పష్టం భూసారాన్ని కాపాడితేనే వ్యవసాయం లాభసాటి: ఏఓ రామకృష్ణారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సమీక్ష: ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపు బ్రహ్మసముద్రం మండలంలో భార్యాభర్తలు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు సమావేశానికి నాయకులు హాజరు కావాలి

మీ ముందుకు వస్తాను.. మీ సమస్యలు వింటాను.. వాటి పరిష్కారానికి కృషి చేస్తాను..

Select Suryaa Now
మీ ముందుకు వస్తాను..  మీ సమస్యలు వింటాను..  వాటి పరిష్కారానికి కృషి చేస్తాను..

విజయనగరం, సూర్య : మీ ముందుకు వస్తాను..మీ సమస్యలు వింటాను..వాటిని పరిష్కరిస్తాను అంటూ కూటమి మేయర్ అభ్యర్థిని అవనాపు భార్గవి ఓటర్లుకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ - అభివృద్ధిని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని అవనాపు భార్గవి ఓటర్లును అభ్యర్థించారు. మేయర్ అభ్యర్థినిగా తనను గెలిపించాలని కోరారు. తాను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా, ఎమ్మెల్యే అతిథి గజపతితో కలిసి అడుగులు వేస్తున్నానన్నారు. ఎమ్మెల్యే సహకారంతో నగర ప్రజలకు మరింత మెరుగైన పాలనను అందిస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నగరంలోని 42,43,45 డివిజన్లలో ఎమ్మెల్యే అధితితో కలిసి కూటమి మేయర్ అభ్యర్థిని అవనాపు భార్గవి పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడి ప్రజలు, మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు. విటీ అగ్రహారం రొంగలి వీధి ఆంజనేయ కోవెల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే అధితి, అవనాపు భార్గవి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాల్లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేత్రత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని ఎమ్మెల్యే అధితి ఉద్ఘాటించారు. అందువల్ల రాష్ట్రం, జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. రెండున్నర ఏళ్లలో  కూటమి ప్రభుత్వ సహకారం వల్ల కోట్లాది నిధులు తెచ్చి నగర అభివృద్ధికి కృషి చేశామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఒక వైపు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే మరో వైపు అభివృద్ధికి కూడా పెద్ద పీఠ వేస్తోందన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా నగరంలో కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసి విద్యుత్ సమస్య తీర్చామని గుర్తు చేశారు. దేశ, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ మాదిరిగా నగరంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా కూటమి మేయర్ అభ్యర్థిని అవనాపు భార్గవిని, కార్పొరేట్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే అధితి కోరారు. ఈ ప్రచార సభలో కూటమి కార్పొరేట్ అభ్యర్థులు రౌతు సతీష్ (42వ డివిజన్ ), మజ్జి శివకుమార్(43వ డివిజన్), మాతా గాయత్రి(45వ డివిజన్) తదితరులు పాల్గొన్నారు.

ఛాంబర్ అఫ్ కామర్స్, రోటరీ, క్రెడాయ్ ఆధ్వర్యంలో..

విజయనగరం నగరపాలక సంస్థకు జరుగుచున్న ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ఉల్లివీధిలో గల ఛాంబర్ అఫ్ కామర్స్ కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఛాంబర్ అఫ్ కామర్స్  రోటరీ క్లబ్, రోటరీ క్లబ్ సెంట్రల్, క్రెడాయ్ అసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా  నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే అదితి  విజయలక్ష్మి గజపతి రాజు, మేయర్ అభ్యర్థిని  అవనాపు భార్గవి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ల సభ్యులు వారిని సత్కరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అధితి గజపతి మాట్లాడుతూ కూటమి పార్టీలు బలపర్చిన మేయర్ అభ్యర్థిని అవనాపు భార్గవిని, మీమీ డివిజన్లలో పోటీ చేస్తున్న కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు అందరిని అత్యధిక మెజరీతో గెలిపించాలని కోరారు. కూటమి గెలుపు ద్వారా నగరాభివృద్ధికి మీవంతు తొడ్పాటు అందించినట్టు అవుతుందని ఎమ్మెల్యే అధితి వారికి విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అవనాపు విజయ్, జనసేన నాయకురాలు పాలవలస యశస్వి పాల్గొన్నారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.