ఏడవ వార్డులో తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఏడవ వార్డు తెదేపా అభ్యర్థి కంపా రజిని స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ కలిసి స్థానికంగా ఉన్న సమస్యను అడిగి తెలుసుకున్నారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా కాకాని అశోక్ ను, కౌన్సిలర్ అభ్యర్థిగా తన కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థి తోపాటు మాజీ కౌన్సిలర్ మాగులూరి తిరుపతమ్మ, గోపాలకృష్ణ వెంకటరత్నం, తదితరులు ఉన్నారు.