30 మద్యం సీసాలు స్వాధీనం
మెలియాపుట్టి, సూర్య : మెలియాపుట్టి మండలంలోని మారడికోట పంచాయతీ పరిధి చీడిపాలెం గ్రామంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సవర రామన్న ఇంటి వద్ద ఉన్న పాన్‌షాప్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలు, నిల్వలపై నిఘా మరింత కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు.
రిపోర్టర్ : నాగిరెడ్డి, మెలియాపుట్టి, శ్రీకాకుళం జిల్లా.