BREAKING
భారీ బందోబస్తు మధ్య ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లకు *కంట్రోల్ రూమ్‌లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా... *ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఆర్. దామోదర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ప్రత్యేక బృంద సభ్యులు తె ర్లాం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా ఎన్ వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు హడలెత్తిస్తున్న గ్రామసింహాలు - భయం గుప్పిట్లో చిన్నారులు, వృద్ధులు బాల్య వివాహాల నిర్మూలనకు మహిళా సంఘాలు ముందుండాలి ఆల్ ఇండియా లీగల్ స్టూడెంట్స్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడిగా నాగరం రణదీప్ రెడ్డి... గజపతినగరం ఎంపీపీ అభ్యర్థి గంట్యాడ శ్రీదేవి నామినేషన్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ చైర్మన్ అభ్యర్థి ప్రచారం డ్రైనేజీ సమస్యపై అధికారుల నిర్లక్ష్యం..! - దుర్వాసనతో ప్రజల అవస్థలు గుర్ల జెడ్పీటీసీ తేదేపా అభ్యర్దిగా చనమల్ల రాధ పంట నష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు---- ప్రభుత్వాలు ఆదుకోవాలి.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తొలగింపునకు బీజేపీ పాదయాత్ర.. రేపు దమ్మాయిగూడలో సన్నాహక సమావేశం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే సహకారంతో ఐదు లక్షల ఎల్ ఓ సి చెక్కు అందజేత

నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పండుగ సాయన్న - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

Select Suryaa Now
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పండుగ సాయన్న - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : పెత్తందారులు, భూస్వాములు, జమీందారీ వ్యవస్థతో పాటు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న జయంతి వేడుకలకు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అణచివేతను ఎదిరించి పోరాడిన ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ అని తెలిపారు. తెలంగాణ ప్రజావీరుడుగా, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. సమాజంలోని పేద ప్రజల కష్టాలను గుర్తించి, వారి సంక్షేమానికి కృషి చేశారని, ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయమని తెలిపారు. సమాజంలోని పేద ప్రజల సంక్షేమానికి తోడ్పడిన ఇలాంటి మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమానత్వం, సేవాభావం, పేదల పట్ల మానవత్వం పెంపొందించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా పరిషత్ సిఈఓ గణపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.