BREAKING
ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో ఈ-శ్రమ, టెలీ లా శిబిరాలు నిర్వహించాలి భారత్-యూకే వాణిజ్యాంబరానికి గండి...స్కాచ్ విచారణపై ట్రేడ్ బాడీ ఆందోళన రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కేనా? పూనూరు టిడిపి ఎంపీటీసీ రెబల్ అభ్యర్థిగా సాయి కార్తీక్. ఉక్రెయిన్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై రష్యా ముప్పేట దాడి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ హర్షవర్ధన్ రాణె, సాదియా ఖతీబ్ లవ్ స్టోరీ 'సితా' విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి ఎప్పుడంటే? చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చి నామినేషన్ దాఖలు చేసిన జడ్పిటిసి అభ్యర్థి మహాదేవి. ఉత్తరాఖండ్‌కు కళాకారులు రాకూడదనుకుంటున్నారా.. మంత్రి సుబోధ్ ఉనియాల్‌ను నిలదీసిన సింగర్ మికా సింగ్ లండన్ వెకేషన్‌లో అక్షయ్ కుమార్ కుమారుడితో అనన్య పాండే.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్ ఎన్నికల నిర్వహణపై రూట్, జోనల్ అధికారులతో సమావేశం మీ ముందుకు వస్తాను.. మీ సమస్యలు వింటాను.. వాటి పరిష్కారానికి కృషి చేస్తాను.. టైగర్ ష్రాఫ్ పై దాడి ఘటనపై అశోక్ పండిట్ సంచలన వ్యాఖ్యలు.. అందరికీ భద్రత సాధ్యం కాదంటూ స్పష్టీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి : జిల్లా కలెక్టర్

ఎల్ నినో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం.. రైతులు ఆందోళన చెందవద్దు!, మహాదేవపూర్ రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం

Select Suryaa Now
ఎల్ నినో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం.. రైతులు ఆందోళన చెందవద్దు!, మహాదేవపూర్ రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం

మహాదేవపూర్,  మేజర్ న్యూస్, రాష్ట్రంలో ఎల్‌నినో  ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, వర్షపాతంలో లోటు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం మహాదేవపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన అత్యవసర వీడియో కాన్ఫిడెన్స్ మరియు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రకృతి వైపరీత్యాలు మరియు వాతావరణ మార్పుల వల్ల అన్నదాతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. కష్టకాలంలో ప్రభుత్వం ఎప్పుడూ రైతు వెంటే ఉంటుందని, సాగునీరు, విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్ హసీనా భాను అక్బర్ ఖాన్, పాస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు, మండల సర్పంచ్‌లు చల్ల సమ్మిరెడ్డి, మోతే నీలాంబరి, అలాగే పెద్ద ఎత్తున స్థానిక రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.

రిపోర్టర్ :  ఇనుగాల ప్రకాష్, మహాదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా