ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి
ఎంపీడీవో విజయ
భూదాన్ పోచంపల్లి మేజర్ న్యూస్:
ఎల్ నీనో నేపథ్యంలో ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో విజయ అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన గ్రామసభలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నీటిని ,కరెంటును పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని గృహ అవసరాల వ్యర్థపు నీటిని ,వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవాలని సూచించారు. అనంతరము ప్రజలచే సామూహిక ప్రతిజ్ఞ చేయించారు .ఈ కార్యక్రమంలో ఏ ఓ శైలజ, ఎం పి ఓ శ్రీమాలిని ,సర్పంచ్ ఫకీరు లతా నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ ఉప్పల శేఖర్ రెడ్డి, ఎమ్మారై సత్యనారాయణ రెడ్డి, ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ సాయినాథ్, ఏపీవో కృష్ణమూర్తి ,ఏపిఎం తౌరియా నాయక్, కందాడి యాదిరెడ్డి, రామ్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.