బిజెపి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం....
సూర్య కరీంనగర్ :భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం గురువారం రోజున జిల్లా శాఖ కార్యవర్గ ప్రకటన విడుదల చేశారు.జిల్లా ఉపాధ్యక్షులుగా గుర్రాల వెంకట్ రెడ్డి ,బింగి వేణు,ఎర్రబెల్లి సంపత్ రావు , దురిశెట్టి సంపత్ ,సిహెచ్. నరసింహరాజు
గాజుల స్వప్న , జిల్లా ప్రధాన కార్యదర్శులు గా గుజ్జ శ్రీనివాస్ రావు , మాడ వెంకట్ రెడ్డి,కానుమల్ల గణపతి , జిల్లా కార్యదర్శులు గా గుంజేటి శివ కుమార్ ,కోల అశోక్ , సంపెల్లి సంపత్ రావు, చేపురి సత్యం గౌడ్ ,ధాడి సునీత , రెడ్డవేని రాజు , జిల్లా కార్యాలయ కార్యదర్శిగా కాడార్ల విమల్ కుమార్ . జిల్లా ఐటీ కన్వీనర్ అన్నాజి వినీత్ కుమార్ ,
జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గొడుగు వినోద్ కుమార్ ల నియామకం జరిగింది.జిల్లాలో భారతీయ జనతా పార్టీనీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి , కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలు , నిర్ణయాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి నూతన జిల్లా కార్య వర్గం తగిన కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం సూచించారు.