ఇందిరమ్మ ఇళ్లపై ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం --జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
--ఇందిరమ్మ ఇళ్లపై ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం
--జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్) ఇందిరమ్మ ఇళ్లపై ప్రతిపక్షాలు రోడ్లు ఎక్కటం విడ్డూరంగా ఉన్నదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్గ సహచరులతో కలిసి నిష్పక్షపాతంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని,రైతు రుణ మాఫీ,ఉచిత ఆర్ టి సి బస్,200 యూనిట్లు ఉచిత విద్యుత్,అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వటంలో రాజకీయానికి తావులేకుండా నిష్పక్షపాతంగా ప్రభుత్వ అధికారులు విచారణ జరిపి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు విడతల వారీ పద్ధతిలో జరిగిందని రాబోవు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన పేద వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరి ఇప్పిస్తారని,ఎక్కడైనా పోబాబాట్లు జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆన్నారు. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిష్పక్షపాతంగా నిర్మిస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.