telangana
అమరజీవి కొమరం భీం జయంతి సందర్భంగా వారసుల ఘన నివాళులు
సూర్య, జైనూర్ : ఆదివాసీల హక్కుల కోసం పోరాడి, జల్–జంగల్–జమీన్ నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపిన అమరజీవి కొమరం భీం జయంతిని ఆయన వారసులు ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 22న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని పెద్దదొబ గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కొమరం భీం మనుమడు కొమరం సోనేరావు, కొమరం భీంరావు, వారసులు కొమరం మాధవరావు, కొమరం జంగు, కుంరం భీము తదితర కుటుంబ సభ్యులు కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ పటేలు కుంరం సోము, గ్రామ పెద్దలు కుంరం బారు, పూసం జంగు, కుంరం రాంష్రావు, పెందోర్ దద్దు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరం భీం చేసిన పోరాటాలను స్మరించుకుంటూ, ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొమరం భీం ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆదివాసీల ఐక్యతను కాపాడుకోవాలని అన్నారు.