రోడ్డుపైనే మక్కలు-ప్రయాణికులకు ఇక్కట్లు
నవాబుపేట సూర్య న్యూస్:మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపైనే మక్కలు ఆరబోస్తుండటంతో ప్రయాణికులు,రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కారుకొండ గ్రామంలో సీసీ రోడ్డుపై మక్కలు ఆరబోస్తుండటంతో ఈ మార్గంలో సిద్ధోటం గ్రామానికి వెళ్లేవారితో పాటు పొలాలకు వెళ్లే రైతులకు రాకపోకల్లో ఇబ్బందులు తప్పడం లేదు.అదేవిధంగా నవాబుపేట మండల కేంద్రం నుంచి రాజాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఆర్సిపూర్ గేటు వద్ద కూడా మక్కలు ఆరబోస్తున్నారు.ప్రధాన రహదారిపైనే మక్కలు ఆరబెట్టడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.రహదారులు రాకపోకల కోసం ఉపయోగించాల్సి ఉండగా,ఇలా మక్కలు ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్లపై మక్కలు ఆరబెట్టకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.