BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ హర్షవర్ధన్ రాణె, సాదియా ఖతీబ్ లవ్ స్టోరీ 'సితా' విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి ఎప్పుడంటే? చంటి బిడ్డను ఎత్తుకొని వచ్చి నామినేషన్ దాఖలు చేసిన జడ్పిటిసి అభ్యర్థి మహాదేవి. ఉత్తరాఖండ్‌కు కళాకారులు రాకూడదనుకుంటున్నారా.. మంత్రి సుబోధ్ ఉనియాల్‌ను నిలదీసిన సింగర్ మికా సింగ్ లండన్ వెకేషన్‌లో అక్షయ్ కుమార్ కుమారుడితో అనన్య పాండే.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్ ఎన్నికల నిర్వహణపై రూట్, జోనల్ అధికారులతో సమావేశం మీ ముందుకు వస్తాను.. మీ సమస్యలు వింటాను.. వాటి పరిష్కారానికి కృషి చేస్తాను.. టైగర్ ష్రాఫ్ పై దాడి ఘటనపై అశోక్ పండిట్ సంచలన వ్యాఖ్యలు.. అందరికీ భద్రత సాధ్యం కాదంటూ స్పష్టీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ 30 మద్యం సీసాలు స్వాధీనం ఐఫా 2027 వేదికపై సల్మాన్ ఖాన్ అల్లరి.. రష్మిక మందన్నాపై సెటైర్లు, వరుణ్ ధావన్‌తో చిలిపి డ్యాన్స్ మండలంలో 109 ఎంపిటిసి నామినేషన్లు బడ్జెట్ లోటు పూడ్చేందుకు ఇటలీలో ఇంధన సంస్థలపై ట్యాక్స్ పెంపునకు కసరత్తు ఏడవ వార్డులో తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం. ప్రమాద రహిత రంగారెడ్డే లక్ష్యం.. రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు

ఎండిన పంటలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు....

Select Suryaa Now
ఎండిన పంటలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు....


#. ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటించాలి:---- 
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు
బి.వి. రాఘవులు. 
#. చర్లపల్లి లో సిపిఐఎం బృందం కరువు పరిస్థితులను పరిశీలన...
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్.... ఎలినోవా ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. గురువారం నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామంలో ఎలినోవా ప్రభావంతో ఎండిపోయిన పంట పొలాలను సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా నాయకత్వం, రైతు సంఘం నాయకులతో గురువారం కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం బి.వి. రాఘవులు మాట్లాడుతూ.చర్లపల్లి గ్రామంలో ప్రధానంగా వరి, పత్తి పంటలు సాగు చేశారు. వరి పంట పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని చోట్ల పంట పూర్తిగా ఎండిపోయాయి. తాలు తప్ప గింజ కనిపించని పరిస్థితి నెలకొంది. మరో తడుపు నీరు అందితే పంట చేతికొచ్చేది. మొత్తం పెట్టుబడి పెట్టి పంట దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు చివరికి ఒక్క పైసా కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. చిన్న, సన్నకారు రైతులు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే వారి జీవితాలు ఎంత హృదయవిదారకంగా ఉంటాయో ఇక్కడి రైతుల పరిస్థితిని చూస్తే అర్థమవుతోందని  అన్నారు.పత్తి చేలు పైకి పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ఆకులన్నీ వాడిపోయాయి. మరో వారం రోజులు వర్షం లేకపోతే పత్తి పంట కూడా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వర్షాభావం వల్ల పంట పెరుగుదల లేదు. కాపు కాసిన కాయలు కూడా ఎండిపోయి రాలిపోతున్నాయి. భవిష్యత్తులో మళ్లీ వర్షాలు పడతాయనే గ్యారెంటీ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో తక్షణమే ప్రకటించాలి” అని రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎలినోవా ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై చర్చించేందుకు రేపు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో వచ్చింది. అయితే కేబినెట్‌లో కూర్చొని చర్చిస్తే రైతుల వాస్తవ పరిస్థితులు పూర్తిగా అర్థం కావు. మంత్రులందరూ జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 315 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.తాగునీటి సమస్యతో పాటు రైతుల కష్టాలపైనా దృష్టి పెట్టాలని“కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు నిధులు కోరినట్లు చెబుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలి. రేపటి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వనరుల నుంచి తక్షణ సహాయంగా రైతులకు ఎంత మొత్తాన్ని ఖర్చు చేయబోతున్నారో కూడా ప్రకటించాలి” అని డిమాండ్ చేశారు.
నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి” అని బి.వి. రాఘవులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ పర్యటనలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, సుధాకర్ రెడ్డి,  నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు
పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం, దండంపెల్లి సత్తయ్య, కొండ అనురాధ,  తదితరులు పాల్గొన్నారు...