వార్తకు స్పందన.. కదిలిన అధికారులు!పైప్ లికేజి సమస్య పై చర్యలు....
సూర్య బెజ్జుర్ :కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జుర్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు బురదమయంగా మారుతున్న సమస్యపై ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. పైప్‌లైన్ లీకేజీ కారణంగా కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వార్త ద్వారా వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తే అధికారులు స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలనే దానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.