ప్రచార కార్యక్రమంలో అడుగడుగునా వైసిపికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు...
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : 64వ డివిజన్ లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు 64వ డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి. వైసీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై. YCP పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.అనంతరం ఆ ప్రాంతంలో మైనారిటీ నేతలు, వైసిపి అభ్యర్థి జియా కౌర్ తో కలిసి.. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఫ్యాను గుర్తు పై ఓటు వేసి..64వ డివిజన్ వైసిపి అభ్యర్థి జియా కౌర్ ని. అలాగే మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి ని గెలిపించాలని ప్రజలను కోరారు. గతంలో నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు వివరించారు. నెల్లూరు నగరం మరింత అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.