BREAKING
కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో మాజీ స్పీకర్ యనమల.. రక్తనాళాల్లో అడ్డంకిని తొలగించిన వైద్యులు ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యం: వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 460 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ యెమెన్ తైజ్‌లో భీకర పోరు: 2.6 లక్షల మందికి చేరిన నిరాశ్రయుల సంఖ్య.. ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన! ముస్లింలపై వివక్షను ఖండించిన బిల్ క్లింటన్: పవిత్ర ఖురాన్ సూక్తులను ఉటంకిస్తూ మాజీ అమెరికా అధ్యక్షుడి హితవు! యూరప్ బ్యాంకింగ్ రంగంలో కొత్త వ్యూహాలు మా సైనికులను క్షేమంగా వదిలేయండి.. లేదంటే అంతం చేస్తాం: హైతీ గ్యాంగ్‌లకు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు బుకెలే తీవ్ర హెచ్చరిక! చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్: ఆస్ట్రేలియాలో మెటాపై భారీ క్లాస్-యాక్షన్ దావా! చిలకలూరిపేటలో రేణుక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: ప్రత్తిపాటి పుల్లారావు ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంతృప్తిఎన్నికల భద్రతకు పటిష్ట చర్యలు.. 7,500 మంది సిబ్బంది నియామకానికి చర్యలు అధికంగా నష్టాలను చవిచూసిన ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం మణుగూరులో ఘనంగా కొమరం భీం జయంతి పర్షియన్ గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: అమెరికా సైనిక స్థావరాలపై దాడులు తప్పవు.. ఐఆర్‌జీసీ తీవ్ర హెచ్చరిక! పుతిన్-విట్‌కాఫ్ శాంతి చర్చల వేళ ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షంఇద్దరు మృతి, 34 మందికి గాయాలు!

పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు

Select Suryaa Now
పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు

 సూర్య బోథ్:బోథ్ మండలం నిగిని గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతని వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్యలో పెంచుతున్న 40 గంజాయి మొక్కలను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.నిగిని గ్రామానికి చెందిన లక్ష్మన్ మదావి (51) తనకు గంజాయి తాగే అలవాటు ఉండటంతో  గంజాయి కొనుగోలు చేసి వినియోగించిన అనంతరం మిగిలిన గంజాయి నుంచి విత్తనాలను సేకరించినట్లు విచారణలో వెల్లడించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తన వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్యలో ఎవరికీ తెలియకుండా గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. మొత్తం 40 గంజాయి మొక్కలు గుర్తించారు. ఒక్కో మొక్క విలువ సుమారు రూ.10,000 చొప్పున మొత్తం రూ.4 లక్షలుగా అంచనా వేశారు. గంజాయి సాగు, విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని బోథ్ సీఐ డి. గురుస్వామి హెచ్చరించారు. గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై బోథ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో బోథ్ ఎస్ఐ వి. పురుషోత్తం, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.