BREAKING
ఇంకొల్లులో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన బాపట్ల కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ కెనడా మార్కెట్లలో భయాలు కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో మాజీ స్పీకర్ యనమల.. రక్తనాళాల్లో అడ్డంకిని తొలగించిన వైద్యులు ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యం: వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 460 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ యెమెన్ తైజ్‌లో భీకర పోరు: 2.6 లక్షల మందికి చేరిన నిరాశ్రయుల సంఖ్య.. ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన! ముస్లింలపై వివక్షను ఖండించిన బిల్ క్లింటన్: పవిత్ర ఖురాన్ సూక్తులను ఉటంకిస్తూ మాజీ అమెరికా అధ్యక్షుడి హితవు! యూరప్ బ్యాంకింగ్ రంగంలో కొత్త వ్యూహాలు మా సైనికులను క్షేమంగా వదిలేయండి.. లేదంటే అంతం చేస్తాం: హైతీ గ్యాంగ్‌లకు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు బుకెలే తీవ్ర హెచ్చరిక! చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్: ఆస్ట్రేలియాలో మెటాపై భారీ క్లాస్-యాక్షన్ దావా! చిలకలూరిపేటలో రేణుక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: ప్రత్తిపాటి పుల్లారావు ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంతృప్తిఎన్నికల భద్రతకు పటిష్ట చర్యలు.. 7,500 మంది సిబ్బంది నియామకానికి చర్యలు అధికంగా నష్టాలను చవిచూసిన ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం మణుగూరులో ఘనంగా కొమరం భీం జయంతి

పండుగ సాయన్నకు ఘనంగా నివాళులర్పించిన శ్రీనివాస్ రెడ్డి

Select Suryaa Now
పండుగ సాయన్నకు ఘనంగా నివాళులర్పించిన శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్సూ,ర్య ప్రతినిధి :

పండుగ సాయన్న 174వ జయంతి సందర్భంగా గురువారం మహబూబ్‌నగర్‌ పద్మావతి కాలనీలో గ్రీన్‌బెల్ట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆనాటి నిజాం ప్రభుత్వ హయాంలో భూస్వాములు, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు పండుగ సాయన్న అని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పండుగ సాయన్న ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు.
పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి, సామాజిక స్పృహ నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డి ఆర్.ఓ. ఏ.నిర్మల,
బి .సి సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.