అయ్యప్ప స్వామి నూతన ఉత్సవ విగ్రహ నిర్మాణం పోత
నెల్లూరు, మేజర్ న్యూస్ : స్థానిక వేదయపాలెం శ్రీ స్వామి అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామివారికి నూతన పంచలోహ ఉత్సవ విగ్రహం నిర్మాణ పోత కార్యక్రమం ఘనంగా జరిగింది అధ్యక్షులు గోడల శేషగిరిరావు కార్యదర్శి కత్తుల వెంకట రత్నం కోశాధికారి గడ్డం రత్తయ్య ఉపాధ్యక్షులు పిటి జగన్నాథం పూజలు నిర్వహించి తదుపరి పలువురు భక్తుల సమక్షంలో అయ్యప్ప శరణు ఘోష మధ్య పుటం ద్వారా బంగారు వెండి రాగి ఇత్తడి సీసం పంచలోహం కరిగించి విగ్రహం పోత పోశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శంకరన్ విజయకుమార్ మురళి రెడ్డి పావల ప్రసాదు అశోక్ కుమార్ పలువురు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు