దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..
కావలి. మేజర్ న్యూస్ : కావలి పట్టణం 13వ వార్డు బృందావనం హౌసింగ్ కాలనీ పక్కన దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి చొరవతో మురుగు కాలువ నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. గత పదేళ్లుగా కాలనీ పక్కన మురుగు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన, దోమలు, విషపురుగుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్య తీవ్రతను కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి కాలువ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు.తమ ఏళ్లనాటి సమస్యకు వెంటనే పరిష్కారం చూపి పనులు ప్రారంభించడం పట్ల కాలనీ వాసి గాధం శెట్టి వంశీ, మరియు బృందావనం కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు,అభినందనలు తెలిపారు.