BREAKING
ముండ్లమూరు మండల జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా మందలపు లాస్య. వైసీపీ పార్టీ తరఫున నెక్కుంది ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన హేమలత! *అశ్వరావుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం* నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, జారే ఆదినారాయణ టాలీవుడ్ స్టార్ హీరో ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలపై నటి రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్‌గా సూరి, సుహాస్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో రికార్డ్ కొడవలూరు మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. టాలీవుడ్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరం.. బాలీవుడ్ బాట పట్టిన స్టార్ హీరోయిన్ రామగోపాల్ వర్మ సంచలన చిత్రం పోలీస్ కంపెనీ విడుదల తేదీ ఖరారు.. అసలు కథ ఏమిటంటే వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు* టిడిపి రెబల్స్ కు ఎమ్మెల్యే గల్లా మాధవి స్ట్రాంగ్ వార్నింగ్

తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ గౌరవిస్తాను – ఆచంట సునీత

Select Suryaa Now
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ గౌరవిస్తాను – ఆచంట సునీత

తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ గౌరవిస్తాను – ఆచంట సునీత

నామినేషన్ ఉపసంహరణ; పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ

జగ్గయ్యపేట మేజర్ న్యూస్:- జగ్గయ్యపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా  ఆచంట సునీత నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈరోజు ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో, ఆమె భర్త  ఆచంట సతీష్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా, జగ్గయ్యపేట శాసనసభ్యులు  శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) వారి నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆచంట సునీత  మాట్లాడుతూ, "నేను ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటాను. పార్టీ సిద్ధాంతాలను ఎప్పటికీ వీడను. పార్టీ పట్ల నాకున్న గౌరవం, విశ్వాసం ఎప్పటికీ మారవు. పార్టీ ప్రయోజనాలే నాకు ముఖ్యం" అని స్పష్టం చేశారు. పార్టీ పట్ల తమ కుటుంబానికి ఉన్న నిబద్ధతను ఆమె పునరుద్ఘాటించారు.

అనంతరం శాసనసభ్యులు తాతయ్య  మాట్లాడుతూ, పార్టీ పట్ల వారు చూపుతున్న నిబద్ధతను, నామినేషన్ ఉపసంహరణ ద్వారా పార్టీ ఐక్యతకు ఇచ్చిన ప్రాధాన్యతను అభినందించారు. "పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తగిన గుర్తింపునిస్తుంది. భవిష్యత్తులో మీకు పార్టీ నుండి మంచి స్థానం కల్పిస్తాం" అని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో యానాల గోపీచంద్  మాట్లాడుతూ పార్టీ ఐక్యత, క్రమశిక్షణే తెలుగుదేశం పార్టీ బలమని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు

 

 

 

రిపోర్టర్ :-శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా