వైసీపీలో చేరిన మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు.
అవనిగడ్డ, మేజర్ న్యూస్: కృష్ణా జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దోవా గోవర్ధన్ గ్రామస్తులు, అభిమానుల నడుమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం అవనిగడ్డలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమనే నమ్మకంతో ఎంతో కాలంగా క్రృష్ణనదీ గర్భంలో ఉన్న పాత ఎడ్లంక గ్రామం సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని తమ గ్రామ అభివృద్ధితో పాటు వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు.
సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాల సాధనకు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం గోవర్ధన్ చేస్తున్న కృషిని అభినందించారు. వైఎస్ జగన్ పాలనలో విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతో ఆయన పార్టీలో చేరారని తెలిపారు.
కార్యక్రమంలో వైసీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి వెంకటేశ్వరరావు, చింతలపూడి లక్ష్మీనారాయణ, నలుకుర్తి రమేష్, మునిపల్లి వెంకటేశ్వరరావు, సైకం బాబురావు, నలుకుర్తి పృథ్విరాజ్, సైకం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా