ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు*
*ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్ తేడాలా?* *అయోమయంలో ఎంపీటీసీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు* *ఎంపీడీఓ నిరక్షమే కారణమా?* కుందుర్పి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్లు తేడాలు వచ్చాయి అంటూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 13వ తేదీ ఎంపీడీవో సంతకంతో విడుదలైన రిజర్వేషన్ వివరాలు ఈరోజు ఎంపీడీవో ప్రదర్శిస్తున్న రిజర్వేషన్ వివరాలు తేడా రావడంతో మండల ప్రజలు కంగుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గెజిటెడ్ ఆధారంగా విడుదలైన రిజర్వేషన్లను ఎంపీడీవో కార్యాలయంతో పాటు అన్ని సచివాలయాల్లోనూ ప్రదర్శిస్తూ, అఖిలపక్ష రాజకీయ సమావేశంలో గెజిటెడ్ ఆధారంగా వచ్చిన రిజర్వేషన్లను అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అందించాల్సి ఉంది. అయితే ఎంపీడీవో నిర్లక్ష్యం కారణంగానో, పొరపాటు కారణంగాను గెజిటెడ్ రిజర్వేషన్లు ప్రదర్శించకపోవడంతో మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా అధికారుల నిర్లక్ష్యం కారణంగానో? లేదా పొరపాట్లు కారణంగానో? మండల ప్రజలు,ఎంపీటీసీ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..రాజు రిపోర్టర్ కుందుర్పి