andhrapradesh
మరికొన్ని గంటల్లో 'బన్ని ఉత్సవం'..
కర్నూలు/దేవరగట్టు:ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ దేవరగట్టులో మాల మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవానికి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ వేడుక ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా మాలా మల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అర్ధరాత్రి 12:15 గంటలకు భక్తుల మధ్య ప్రతిష్టాత్మకమైన 'కర్రల సమరం' జరగనుంది.
ఈ ఉత్సవానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గతాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టారు. ఉత్సవ ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భక్తులు రింగులు తొడిగిన కర్రలను ఉత్సవానికి తీసుకురాకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.