విజయదశమి పండుగలో ప్రకృతి ప్రణవం పుస్తకావిష్కరణ
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:- విజయదశమి పండుగలో జమ్మిచెట్టు, పాలపిట్ట, పూల సంప్రదాయాలతో పాటు పవిత్ర పర్వతాలు, నదులు, వనాల ప్రాధాన్యాన్ని పురాణ, చారిత్రక, జానపద, శాస్త్రీయ కోణాల్లో భూమిపుత్ర శ్రీహరి మూర్తి తన రచనల్లో వివరించారు. పర్యావరణం, వన్యప్రాణులు, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు, సహజ ఆవాసాల పరిరక్షణపై ఆయన చేస్తున్న రచనా కృషిని డీఎఫ్‌ఓ ఎం. గురు ప్రభాకర్ అభినందించారు. ‘విజయదశమి — పండుగలో ప్రకృతి ప్రణవం’ పుస్తకంలో విజయవాడ ఇంద్రకీలాద్రి, కనకదుర్గమ్మ ఆరాధన, కృష్ణానది సాంస్కృతిక ప్రాధాన్యాన్ని పొందుపరచడం ప్రశంసనీయమన్నారు. పండుగలకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా వృక్షసంపద, వన్యప్రాణులు, జలవనరులను పరిరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కుమార్, ఫైట్స్ ఫర్ రైట్స్ అధ్యక్షుడు కె.పి. రాజు, కార్యదర్శి శంకర్ రెడ్డి, న్యాయవాది నీలం నాగరాజు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దీప తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్