ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ–జనసేన పొత్తు విఫలం --8 వార్డుల్లో జనసేన పోటీ
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో జనసేన పార్టీ 8 వార్డుల్లో స్వతహాగా పోటీ చేస్తోంది. పొత్తులో ఆశించిన స్థాయిలో సీట్లు కేటాయించకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసినట్లు జనసేన ఆత్మకూరు ఇన్‌చార్జి నలిశెట్టి శ్రీధర్ తెలిపారు. రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఎనిమిది మంది అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయగా, బుధవారం అభ్యర్థులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు బీ-ఫారాలు సమర్పించారు.తమ అభ్యర్డులు పోటీలో కొనసాగుతారని శ్రీధర్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనున్నాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.