టిడిపి వల్లూరు ఎంపీటీసీ అభ్యర్థిగా సువ్వాడ వనజాక్షి నామినేషన్ దాఖలు
నెల్లిమర్ల, సూర్య : నెల్లిమర్ల మండల కూటమి తరుపున టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా వల్లూరు ఎంపీటీసీ స్థానానికి సువ్వాడ వనజాక్షి బుధవారం నామినేషన్ పత్రాలను లాంఛనంగా దాఖలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే నిజమైన సంక్షేమ, అభివృద్ధి పాలన సాధ్యమని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మండలంలోనూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. మండలంలో కూటమి బలపరిచిన ఎంపీపీ అభ్యర్థిగా తనను, అలాగే వివిధ స్థానాల నుంచి పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కూటమి నాయకులు తెలిపారు.
రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.