మల్లవరం పెదలంకలో దసరా నవరాత్రుల మహోత్సవాలు--మహిళల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు
నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ :మండలంలోని రామా లయం దసరా మల్లవరం పెదలంకలో శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల మహోత్సవాలను తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గ్రామ మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు.
మహోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన అమ్మవారి ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమాలు శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కవురు మురళి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు పెచ్చెట్టి ఏసుబాబు, వేండ్ర బాలకృష్ణ, కవురు ఆదియ్య, కవురు శ్రీనివాసరావు, కవురు శ్రీను (గంగాధర్ కుమారుడు), కట్టా ఆంజనేయులు, యాండ్ర శివ గణేష్, కమిటీ సభ్యులు గ్రామస్థుల సహకారంతో నిర్వహించబడ్డాయి.
నవరాత్రుల మహోత్సవాలను విజయవంతం చేయడంలో భాగస్వాములైన మహిళలు, యువత, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్థులందరికీ ఆలయ అభివృద్ధి కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది.