BREAKING
అంబాజీపేట ఎంపీటీసీ అభ్యర్థిగా గణపతి అనంత తులసి నామినేషన్: విస్తృత ప్రచారం షురూ.. నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు.

పెరవలి మండలంలో ఊపందుకున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

Select Suryaa Now
పెరవలి మండలంలో ఊపందుకున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

                                        వివరాలు వెల్లడించిన పెరవలి మండల ప్రత్యేక అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. సునీల్ వినయ్

పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల (ఎంపీటీసీ) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. అక్టోబర్ 22 వ తేదీ గురువారం పెరవలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో రోజు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.రెండో రోజు మొత్తం 33 నామినేషన్లు దాఖలయ్యాయని, వీటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 14, తెలుగుదేశం పార్టీ తరఫున 10, జనసేన పార్టీ తరఫున 9 నామినేషన్లు ఉన్నాయని పెరవలి మండల ప్రత్యేక అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. సునీల్ వినయ్ వెల్లడించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెరవలి నుంచి పంపన శ్రీ ఆంజనేయులు, కొత్తపల్లి అగ్రహారం నుంచి పాలా పద్మ, కానూరు రెండో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి వెలిగంటి నాగేంద్ర కృష్ణస్వామి, కానూరు మొదటి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి వెంకట సత్యనారాయణ, ఖండవల్లి మూడో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి భీమనాది ప్రభురాం, కొత్తపల్లి అగ్రహారం నుంచి చప్పిడి సావిత్రి, పెరవలి నుంచి పంపన మోహన మణికంఠ, తీపర్రు నుంచి కోడూరి నారాయణరావు, అజ్జరం నుంచి వీరవల్లి శంకరం, కానూరు మొదటి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి కొమ్మిశెట్టి మణీతేజ, కానూరు రెండో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి వెలిగంటి నాగరాజు, ఖండవల్లి రెండో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి కవులూరి కనకదుర్గ, అజ్జరం నుంచి దెయ్యాల వెంకటేశ్వరరావు, తీపర్రు నుంచి ర్యాలి వెంకటేశ్వరరావు నామినేషన్లు దాఖలు చేశారు.
తెలుగుదేశం పార్టీ తరఫున 10 నామినేషన్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఖండవల్లి రెండో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి కేతా లక్ష్మీదుర్గ, పిట్టలవేమవరం నుంచి చిల్లా నవీన్, ఖండవల్లి నాలుగో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పులిదిండి రోజా, ఉసులుమర్రు నుంచి బీర జ్యోతి, ముక్కామల మొదటి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి అక్కిన నాగమణి, నిడదవోలు కుమారి, కొత్తపల్లి అగ్రహారం నుంచి పాలా నాగదుర్గ, గుబ్బల లక్ష్మి, ముక్కామల మొదటి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి చిన్నంశెట్టి తేజ నాగలక్ష్మి, అక్కిన ముత్యావతి నామినేషన్లు దాఖలు చేశారు.
జనసేన పార్టీ తరఫున 9 నామినేషన్లు
జనసేన పార్టీ తరఫున ఖండవల్లి మొదటి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి సుంకర నాగమణి, మల్లేశ్వరం నుంచి మేడిచర్ల భాస్కర్ శివకుమార్, ఖండవల్లి మూడో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి చల్లా వెంకటసుబ్బారావు, మల్లేశ్వరం నుంచి కోటిపల్లి కృష్ణబాబు, ముక్కామల రెండో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి రేలంగి రాజేష్, కాకరపర్రు నుంచి కొప్పుల సాయి సూర్యకుమారి, ముక్కామల రెండో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి రేలంగి వాసు, గుబ్బల వెంకటేశ్వరరావు, కాకరపర్రు నుంచి మల్లిపూడి వరలక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు.ఒకే ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పలువురి నామినేషన్లురెండో రోజు నామినేషన్ల ప్రక్రియలో కొన్ని ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఒకే పార్టీకి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.ముఖ్యంగా ముక్కామల మొదటి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నలుగురు, ముక్కామల రెండో ప్రాదేశిక నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు.అలాగే పెరవలి, అజ్జరం, తీపర్రు, కానూరు, కొత్తపల్లి అగ్రహారం, ఖండవల్లి, మల్లేశ్వరం, కాకరపర్రు ప్రాదేశిక నియోజకవర్గాల్లోనూ ఒకే పార్టీ తరఫున పలువురు నామినేషన్లు సమర్పించారు.నామినేషన్ల దాఖలు ప్రక్రియ అనంతరం పరిశీలన, ఉపసంహరణ వంటి ఎన్నికల ప్రక్రియలు పూర్తయిన తర్వాత తుది పోటీదారుల వివరాలపై స్పష్టత రానుంది.రెండో రోజు మొత్తం 33 నామినేషన్లు స్వీకరించినట్లు పెరవలి మండల ప్రత్యేక అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. సునీల్ వినయ్ తెలిపారు.