BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో మాగంటి బాబు, చింతమనేని నవ్యశ్రీ భేటీ.

Select Suryaa Now
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో మాగంటి బాబు, చింతమనేని నవ్యశ్రీ భేటీ.

‎‎ఏలూరు,: ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో మాజీ ఎంపీ మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్ కుమార్తె  నవ్యశ్రీ వేర్వేరుగా భేటీ అయ్యారు. ముందుగా గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఎంపీ నివాసానికి వచ్చిన మాగంటి బాబు దంపతులు ఎంపీ తో భేటీ అయ్యారు. అనేక సంవత్సరాలుగా పార్టీకి, జిల్లాకు తమ కుటుంబం అందించిన సేవలను గుర్తించి, జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా తన భార్య పద్మవల్లి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా మాగంటి బాబు ఎంపీని కోరారు.

‎     ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ తన భర్త పృథ్వీ కృష్ణతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన నివాసంలో కలిసారు. యువత రాజకీయాల్లోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత, మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పిన చింతమనేని నవ్యశ్రీ, తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను అభ్యర్ధించారు.