BREAKING
ఎన్నికల వేల ముమ్మరంగా వాహన తనిఖీలు" ఎస్ ఐ" గీతా మందిరం వద్ద అఖండ అన్నసమారాధన వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఎన్నికలంటేనే గొడ్డలి పార్టీకి గుబులు.. ఏకగ్రీవంగా తీర్మానించిన వీర మహిళలు - మేయర్ అభ్యర్థి జయశ్రీకి మహిళా లోకం జై భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ శోభాయాత్ర మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి "ఉప్పాడ" వ్యూహం! * రాజకీయ చతురతకు నిదర్శనం * ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం భారీ ఆస్తి నష్టం తొలి రోజు ఇంకొల్లు మండలంలో 18 నామినేషన్లు మండలంలో భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వశుభాలు పాల్వంచ మమత విజయ్ గౌడ్ దంపతులు రాజరాజేశ్వరిగా కామాక్షిదేవికి పూజలు ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు తరలిరావాలి నెల్లూరు ప్రగతి ప్రస్థానం ఆగకూడదు.. షరణి పొంగూరు

ఓర్వకల్లులో తొలిరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల సందడి మూడు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు.. జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి దాఖలు

Select Suryaa Now
ఓర్వకల్లులో తొలిరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల సందడి  మూడు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు.. జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి దాఖలు

ఓర్వకల్లులో తొలిరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల సందడి

మూడు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు.. జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి దాఖలు

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

రెండో సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా ఓర్వకల్లు మండల పరిషత్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు నన్నూరు–3, హుస్సేనాపురం–2, కాల్వ ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి నామినేషన్ సమర్పించారు.

 

నన్నూరు–3 ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నన్నూరు మాజీ సర్పంచ్ శ్రీరెడ్డి చెన్నారెడ్డి సతీమణి శ్రీరెడ్డి శైలజ నామినేషన్ పత్రాలు ఓర్వకల్లు మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సతీష్ కుమార్, అడిషనల్ రిటర్నింగ్ అధికారి ఎం. నాగ అనసూయకు మద్దతు దారులతో కలిసి  సమర్పించారు.

హుస్సేనాపురం–2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా గుట్టపాడు గ్రామ మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి సతీమణి నర్ల లత నామినేషన్ పత్రాలను ఓర్వకల్లు మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సతీష్ కుమార్, అడిషనల్ రిటర్నింగ్ అధికారి ఎం. నాగ అనసూయకు మద్దతుదారులతో  కలిసి అందజేశారు. 

కాల్వ ఎంపీటీసీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కె. జైదాబిఓర్వకల్లు మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సతీష్ కుమార్, అడిషనల్ రిటర్నింగ్ అధికారి ఎం. నాగ అనసూయకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

అదేవిధంగా, ఓర్వకల్లు మండల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ నాయకుడు ఏసేపు సతీమణి చేట్ల దానమ్మ కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలు సమర్పించారు.