పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
పెద్దశంకరంపేట;పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. బుధవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన షేర్పల్లి దుర్గయ్యకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన ఎల్డీసీ రూ.5 లక్షల చెక్కును లబ్దిదారుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా పేదల కుటుంబాల సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుంట్ల రాములు తదితరులున్నారు.