పాలకోడేరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా చింతలపాటి శివ నాగరాజు నామినేషన్ టీడీపీలో సుదీర్ఘకాలంగా అందించిన సేవలకు గుర్తింపుగా అవకాశం
భీమవరం సూర్య న్యూస్: పాలకోడేరు మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా చింతలపాటి శివ నాగరాజు బుధవారం భీమవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీకి ఆయన తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామానికి చెందిన చింతలపాటి శివ నాగరాజు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు. పార్టీలో ఆయన అందించిన సేవలను గుర్తించిన నాయకత్వం కూటమి తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిందని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో కూటమి విజయమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని శివ నాగరాజు స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తానన్నారు. ప్రజల మద్దతుతో విజయం సాధించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పాలకోడేరు మండల అభివృద్ధికి కట్టుబడి ఉంటూ, కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.