అభ్యర్థులకు తెలియకుండానే ఇద్దరు వైసిపి నామినేషన్ల ఉపసంహరణ
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో చివరి రోజు నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా తమకు తెలియకుండానే నామినేషన్లు ఉపసంహరణ చేసినట్లు ధ్రువీకరించారని 10, 24వ వార్డులకు చెందిన వైసీపీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 24వ వార్డు అభ్యర్థి బడుగు శ్రీనివాసులు, పదో వార్డు అభ్యర్థిని ప్రవీణ తమకు తెలియకుండానే నామినేషన్లు ఉపసంహరణ ఎలా చేశారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. గడువు ముగిసినందున తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని అధికారులు చెప్పడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.తమకు జరిగిన అన్యాయంపై ఎన్నికల కమిషనర్ కు మరియు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు తమ సిద్ధమని వైసిపి అభ్యర్థులు తెలిపారు.వీరితోపాటు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న వైసిపి నేతలు ఇటువంటి అన్యాయం ఎక్కడా లేదని దీనిపై విచారణ చేపట్టాలని వారి వాదన తెలిపారు.