తొలి రోజు ఇంకొల్లు మండలంలో 18 నామినేషన్లు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :ఇంకొల్లు మండలంలో తొలిరోజు ఎం.పి.టి.సి సభ్యులకు 18 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి రమేష్‌బాబు తెలిపారు. వై.సి.పి నుండి 14, టి.డి.పి నుండి 2, జనసేన నుండి 1, ఇండిపెండెంట్ 1 నామినేషన్లు దాఖలయ్యాయి. కొణికి ఎం.పి.టి.సి పరిధిలో జనసేన పార్టీ నుండి పెళ్ళూరి శివరామకృష్ణ, బండి రాంప్రసాద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా, వంకాయలపాడు ఎం.పి.టి.సి స్థానం నుండి టి.డి.పి అభ్యర్థి పిడపర్తి ధనలక్ష్మి, పావులూరు ఎం.పి.టి.సి నుండి టి.డి.పి అభ్యర్థి పావులూరి నాగమల్లేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నుండి పూసపాడు ఎం.పి.టి.సి అభ్యర్థులుగా అల్లంశెట్టి వెంకటసుబ్బారావు, నూనె వెంకట సుబ్బయ్య, ఇడుపులపాడు-1 ఎం.పి.టి.సి అభ్యర్థులుగా బండారు పాపారావు, బండారు అజీత్ బాబు, నాగండ్ల ఎం.పి.టి.సి అభ్యర్థులుగా రావిపాటి మల్లేశ్వరి, మొరబోయిన సులోచన, ఇంకొల్లు-3 ఎం.పి.టి.సి అభ్యర్థిగా దుడ్డు ఇందుమతి, ఇంకొల్లు-4 ఎం.పి.టి.సి అభ్యర్థిగా నీలం శ్రీనివాసరావు, గంగవరం ఎ.పి.టి.సి స్థానం నుండి పంది సుబ్బమ్మ, భవనం పూర్ణిమ, వణుకూరి నాగలక్ష్మి, భీమవరం ఎం.పి.టి.సి అభ్యర్థులుగా రెబ్బా స్వామి, జ్యోతి బాజిలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకొల్లు ఎస్సై వినోద్ కుమార్ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ గట్టా శ్రీనివాసరావు, తహశీల్థారు ఏ.వి.ఎస్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.