ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు వి. నవీన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రికి ఆయన హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ విజయోత్సవ పండుగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. దుర్గాభవాని అమ్మవారి దివ్య ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కి విజయదశమి పండుగ శుభాభినందనలు అందజేశారు.