రైలు ఢీకొని యువకుడి మృతి
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జోన్ వైపు రైల్వే పట్టాల పక్కన మంగళవారం ఉదయం ఓ యువకుడు తీవ్ర గాయాలతో విగత జీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న కర్నూలు జీఆర్పీ హెచ్‌సీ కోదండరాముడు, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతుడిని వెల్దుర్తి పట్టణానికి చెందిన మూలింటి శివాజీ (21)గా గుర్తించారు. ఇంటి నుంచి మూడు రోజుల క్రితం వెళ్లిన శివాజీని గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలై చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు జీఆర్పీ హెచ్‌సీ తెలిపారు. మృతుని తల్లి సువార్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు వివరించారు. మృతదేహాన్ని వెల్దుర్తి సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి ఇద్దరు సోదరులు ఉన్నారు. అయితే ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం