కామవరపుకోటలో 49 నామినేషన్లు
కామవరపుకోట, మేజర్‌న్యూస్ : కామవరపుకోట మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నిమిత్తం రెండవ రోజు గురువారం 45 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీ మహేందర్ నాథ్ తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్లను శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ ఓ అండ్ ఎంపీడీవో అమీర్, తహసిల్దార్ ఎలీషా తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల్లో మొత్తం 49 నామినేషన్లు దాఖలు అయ్యాయని తెలిపారు. ఇక కాంగ్రెస్ - 1, జనసేన 3, టీడీపీ 19, వైఎస్సార్‌సీపీ 21, స్వతంత్య్ర 1 నామినేషన్లు దాఖలు అయినట్టు మహేందర్ తెలిపారు.