నేదునూరులో పెళ్లి బృందం వ్యాన్ బోల్తా30 మందికి గాయాలు..
అమలాపురం మేజర్ న్యూస్ కోనసీమ జిల్లాలోని నేదునూరు వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ఐషర్ వ్యాన్ బోల్తా పడిన ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. మాచవరం నుంచి పెళ్లి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వ్యానులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మిగిలిన క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురికి శ్రీనిధి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించినట్లు తెలిసింది.ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.