ఉప్పలగుప్తం జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా ఆకుల లక్ష్మీ నరసాయమ్మ నామినేషన్..
అమలాపురం మేజర్న్యూస్ ఉప్పలగుప్తం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో జనసేన అభ్యర్థి ఆకుల లక్ష్మీ నరసాయమ్మ నామినేషన్ దాఖలు..
కూనవరం నుండి అమలాపురం ఈదరపల్లి జడ్పీ కార్యాలయం వరకు జనసేన శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ తో అమలాపురం జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకొని గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
మొదటి నుంచి పార్టీ కోసం శ్రమించినందుకు గుర్తింపుగా తన సతీమణికి అవకాశం కల్పించాలన్న ఆకుల బుజ్జి.
ఎన్నికల్లో తమ గెలుపునకు కూటమి నాయకులందరూ సహకరించాలని ఆకుల బుజ్జి విజ్ఞప్తిచేశారు. మండల ప్రజలు తమకు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. పార్టీ కష్ట కాలం నుంచి కూడా వెన్నంటే ఉన్నానని ఆయన మీడియాకు తెలిపారు