దమ్’ అక్షరాలతో సోనాలికా ప్రపంచ రికార్డు
ఖైరతాబాద్ మేజర్ న్యూస్: రైతుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, గెలుపు స్ఫూర్తిని చాటుతూ సోనాలికా ట్రాక్టర్స్ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా సికంద్రాబాద్‌లో వ్యవసాయ క్షేత్రంపై హిందీ పదం ‘దమ్’ను అత్యంత భారీ పరిమాణంలో చెక్కి ఈ ఘనత సాధించింది. రెండు సోనాలికా గోల్డ్ సిరీస్ ట్రాక్టర్లతో 125 అడుగుల ఎత్తు, 272 అడుగుల వెడల్పుతో మొత్తం 34,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అక్షరాలను రూపొందించగా, వరల్డ్ రికార్డ్స్ ఇండియా గుర్తించింది.ఈ రికార్డు కోసం సోనాలికా గోల్డ్ డీఐ 745, గోల్డ్ డీఐ 55 ట్రాక్టర్లకు 10 అడుగుల రోటావేటర్లను అమర్చి ఉపయోగించారు.
అధునాతన సాంకేతికతతో రూపొందించిన గోల్డ్ సిరీస్‌లో 3-సిలిండర్, 3532 సీసీ ఈ3.5 ఇంజిన్, మల్టీ-స్పీడ్ డ్రైవ్‌లైన్, జెట్‌లైన్ హ్యాండ్ థ్రోటిల్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని సంస్థ తెలిపింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ తయారీ కేంద్రంలో రోబోటిక్స్, ఆటోమేషన్ సాంకేతికతలతో ఈ ట్రాక్టర్లను తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ మాట్లాడుతూ, ప్రతి పంట సీజన్‌ను కొత్త ఆశతో ప్రారంభించే రైతుల ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ‘దమ్’ ప్రతీక అని అన్నారు. రైతుల కృషి సాగే వ్యవసాయ క్షేత్రంలోనే ఈ ప్రపంచ రికార్డును సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.
1996లో ప్రారంభమైన సోనాలికా ట్రాక్టర్స్ ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ట్రాక్టర్ ఎగుమతుల్లో భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. రైతులకు సాధికారత కల్పించడం, వ్యవసాయ యాంత్రీకరణలో భారతదేశ ప్రాధాన్యాన్ని పెంచడం తమ లక్ష్యమని తెలిపింది.