ఓల్డ్ సఫిల్ గూడలో ఘనంగా దసరా సంబురాలు : సంప్రదాయంగా జమ్మిచెట్టు పూజ, రావణ దహనం..
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓల్డ్ సఫిల్ గూడలోని భారత్ మాత భజన్ మందిర్ ఆధ్వర్యంలో జమ్మిచెట్టు పూజ, రావణ దహనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఆర్థిక సహాయం అందజేసిన మౌలాలి డివిజన్ కాలనీల ఫెడరేషన్ ఛైర్మన్ చుంకు శ్రీనివాస్ హజరైనారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ మౌలాలి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ పోతుల ఉమామహేశ్వరి వినోద్ యాదవ్, సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు తదితరులు దసరా వేడుకలో పాలుపంచుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన జమ్మిచెట్టు పూజలో పాల్గొన్న వారు మౌలాలి డివిజన్ ప్రజలకు విజయదశమి (దసరా) శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,చెడుపై మంచి సాధించి న విజయానికి ప్రతీక 'విజయదశమి' అన్నారు. దేవీ ఆశీ స్సులు మౌలాలి డివిజన్ ప్రజలు అందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిం చారు. జమ్మిచెట్టు పూజ మన సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలందరూ పరస్పర ప్రేమాభిమానాలతో, సోదరభావంతో మెలగాలని ఆకాంక్షిస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ మంద భాస్కర్, చంద్రకాంత్, మల్కాజిగిరి యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్, మైనారిటీ సెల్ మౌలాలి ప్రెసిడెంట్ షకిల్, నాయుడు, అనిత, పద్మావతి, కాసింబి, భారతమాతా భజన్ మందిర్ అధ్యక్షుడు బెజ్జంకి గురు, ఉపాధ్యక్షుడు మధు, శివ, కమిటీ సభ్యులు ప్రేమ్, సాయి, సతీష్, శ్రీకాంత్, వెంకటేష్, వేణు, శివ, ధనరాజ్, కుమార్, ప్రేమ్, సూరి, క్రాంతి, దాసి, నవీన్, లడ్డు, చరణ్, గౌరీ, దశరథ్, సత్యయ్య, సతీష్ బాబు, నవీన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.