BREAKING
సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి

Select Suryaa Now
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి

వెంగళరావునగర్, మేజర్ న్యూస్: చెడుపై  మంచి,   అధర్మం పై ధర్మం,  అసత్యం పై సత్యం సాధించిన  విజయాలకు   విజయదశమి ప్రతీకగా   నిలుస్తుందని   ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్  డా. పి.వీ.రవి శేఖర్ రెడ్డి.  అన్నారు. దసరా   పండుగ పర్వదినాన్ని   పురస్కరించుకుని   రహమత్ నగర్  డివిజన్  పరిధి శ్రీరామ్ నగర్  లోని   దుర్గాదేవి పోచమ్మ   ఆలయంలో  డా. రవి శేఖర్ రెడ్డి  ముఖ్య   అతిథిగా  హాజరై ప్రత్యేక పూజలు చేసారు.  ఆలయ వేద పండితులు సతీష్ శర్మ  పర్యవేక్షణలో   నిర్వహించిన మహాచండీ హోమాలు , పూర్ణాహుతి లో  డా. రవి శేఖర్ రెడ్డి  తో   పాటు భక్తులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 ఆలయ   కమిటీ   సభ్యులు డా. రవి శేఖర్ రెడ్డి ని ఘనంగా సత్కరించారు.  ఈ సందర్భంగా డా. రవి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ  షమీ పూజ చేసి   జమ్మి ఆకును బంగారం గా స్వీకరించే గొప్ప సంస్కృతి    మనది   అని, మహాభారతంలో   పాండవులు అజ్ఞాత వాసానికి   వెళ్ళే  ముందు తమ   ఆయుధాలను   జమ్మి చెట్టు పై   దాచి పెట్టి   అజ్ఞాతం  ముగిసిన అనంతరం   వాటిని   తిరిగి తీసుకుని కౌరవులపై   యుద్ధం లో విజయం సాధించిన    విషయాన్ని గుర్తు చేశారు.   ఈ సందర్భంగా  ప్రజలందరికీ     దసరా   పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.   కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు టి. వినోద్ కుమార్, లింగమూర్తి, నాగరాజు, భరత్ కుమార్  తో   పాటు   టెంపుల్ కమిటీ సభ్యులు   సంజీవ్, నర్సింగ్ రావు, అశోక్,  కన్నా తదితరులు పాల్గొన్నారు