వెంగళరావు నగర్ కాలనీలో ఘనంగా రావణ దహన కార్యక్రమం
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: వెంగళరావు నగర్ కాలనీలోని ఓల్డ్ వాటర్ ట్యాంక్ హనుమాన్ గ్రౌండ్‌లో కాలనీ యూత్ ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ యువకులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యూత్ కమిటీ సభ్యులు శరత్, అనిల్, వినయ్ కుమార్, చందు, చంటి, కార్తీక్, అజయ్, ఘోస్, సురేష్, శివ కుమార్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చిలకల వెంకటేశ్వరరావు, డి. ధనంజయరెడ్డి, సున్నం లక్ష్మణ్,అశోక్, శ్యామ్, రవికిరణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.