BREAKING
రైలు ఢీకొని యువకుడి మృతి గాంధీనగర్ డివిజన్,ఎస్ఆర్టి లోని నల్లపోచమ్మ,శ్రీ ఉప్పలమ్మా దేవాలయంలో శమీ పూజ.. స్వర ఝరీ భువన భాస్కర సంగీత సాహిత్య సేవాసమితి ఆధ్వర్యంలో పాటల విభావరి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సంచలనం: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన పాకిస్థాన్! దొమ్మర పోచంపల్లి సర్వే నంబర్ 120లో చెత్త కుప్పలు! స్మశాన వాటికకు దారేది? చెత్తకు నిప్పు.. దట్టమైన పొగలు.. పట్టించుకునే వారేరీ? ఇందిరానగర్ కట్ట మైసమ్మ గ్రౌండ్‌లో ఘనంగా రావణ దహనం శ్రేయాస్ అయ్యర్‌కు షాకిచ్చిన టీమిండియా: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో పొట్టి క్రికెట్ రికార్డులపై ఆసక్తికర చర్చ! మీ కుటుంబ సభ్యులకు బీపీ, షుగర్ ఉంటే.. రోజూ వాళ్లకు గోలీలు వేసి కాపాడుకోండి* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇంకొల్లు మండలంలో 18 నామినేషన్లు ఓల్డ్ సఫిల్ గూడలో ఘనంగా దసరా సంబురాలు : సంప్రదాయంగా జమ్మిచెట్టు పూజ, రావణ దహనం.. దమ్‌’ అక్షరాలతో సోనాలికా ప్రపంచ రికార్డు రోజూ హై హీల్స్ ధరిస్తున్నారా? పాదాలు, మోకాళ్లు, వెన్నుపూసపై తీవ్ర ప్రభావం! నాగలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమం మార్కో జాన్సెన్ ఆల్‌రౌండ్ వీరవిహారం: 60 ఏళ్ల రికార్డు బ్రేక్, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జోరు!

మండలంలో భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు

Select Suryaa Now
మండలంలో భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు

సిఎస్ పురం,మేజర్ న్యూస్,,విజయదశమి పండుగ సందర్భంగా మంగళవారం మండలంలోని గ్రామాల్లో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో దసరా పండుగ వేడుకలు జరుపుకున్నారు.ఈసందర్భంగా మండలకేంద్రమైన సిఎస్ పురం మరియు గ్రామాల్లో ప్రజలు వేకువజామున నుండి ఇళ్లముందు రంగుల అలంకరణ చేసి అనంతరం గ్రామాల్లో దేవస్థానాలకు వెళ్లి పూజలుచేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈసందర్భంగా సిఎస్ పురంలోని శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి,రాచూరిపెద్దమ్మతల్లి,భైరవకోన దేవస్థానాల్లో స్వామివార్లు,అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈసందర్భంగా కామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో కామాక్షి అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసిన పల్లకీ నందు ప్రతిష్ఠించి మేళతాళాలు భక్తుల దేవీభక్తిపాటలతో ప్రదక్షిణలు నిర్వహించి హరతులు నైవేద్యం సమర్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా పెద్దమ్మతల్లి దేవస్థానం నందు అమ్మవారికి పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా దేవస్థానాలు భక్తజనసందడితో పండుగ సందడి నెలకొన్నది.