BREAKING
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు అభ్యర్థులకు తెలియకుండానే ఇద్దరు వైసిపి నామినేషన్ల ఉపసంహరణ రెండు రోజులుగా తాగునీటి కరువు! ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా చేయలేని పరిస్థితి.. ప్రజల ఇబ్బందులు పట్టించుకునేదెవరు? ఏ. నారాయణపురము 2 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి కే లాలు స్వామి నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – ఏఎస్పీ సౌజన్య కోనంకి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా జొన్నలగడ్డ రేణుకాదేవి తొలి నామినేషన్ బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు  ఆస్కార్ రేసులో నిలిచిన కొరియన్ మూవీ పాసిబుల్ లవ్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ మామదాపూర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు పాలకోడేరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా చింతలపాటి శివ నాగరాజు నామినేషన్ టీడీపీలో సుదీర్ఘకాలంగా అందించిన సేవలకు గుర్తింపుగా అవకాశం అశ్వారావుపేట మండలంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం — పోలీసుల దర్యాప్తు కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడే! డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం యద్దనపూడిలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు

"ఉప్పాడ" వ్యూహం! * రాజకీయ చతురతకు నిదర్శనం *

Select Suryaa Now
"ఉప్పాడ" వ్యూహం!    * రాజకీయ చతురతకు నిదర్శనం *

భోగాపురం, సూర్య : స్థానిక రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించడం, అనుకూల సమయాన్ని అందిపుచ్చుకోవడంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, సీనియర్‌ నాయకుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. మారిన ఎన్నికల నిబంధనలను రాజకీయ అవకాశంగా మలుచుకుంటూ, మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. గతంలో సవరవిల్లి ఎంపీటీసీగా విజయం సాధించిన ఆయన, ఈసారి అదే స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. 1995 తర్వాత ముగ్గురు పిల్లల నిబంధన అమల్లోకి రావడంతో ఎన్నికల్లో పోటీకి దూరమైన సూర్యనారాయణరెడ్డికి, ప్రస్తుత ఎన్నికల్లో ఆ నిబంధన తొలగింపుతో మళ్లీ అవకాశం లభించింది. దీంతో తన రాజకీయ అనుభవాన్ని మరోసారి ప్రజాక్షేత్రంలో పరీక్షించుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఆయన సతీమణి కూడా అమటాం రాయివలస ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయనున్నారు. గతంలో ఆమె సవరవిల్లి ఎంపీటీసీగా విజయం సాధించారు. మండల రాజకీయాలపై అవగాహన, స్థానిక పరిస్థితులపై పట్టుతో ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి ఎన్నికల వేళ తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భార్యాభర్తలు వేర్వేరు ఎంపీటీసీ స్థానాల నుంచి బరిలోకి దిగుతుండటంతో భోగాపురం మండల రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల వ్యూహాల వరకు తనదైన రాజకీయ చతురతను ప్రదర్శించే సూర్యనారాయణరెడ్డి, ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారో వేచి చూడాలి.

రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.