BREAKING
19 ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ.. వైభవంగా దుర్గ మాత ఊరేగింపు ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు అభ్యర్థులకు తెలియకుండానే ఇద్దరు వైసిపి నామినేషన్ల ఉపసంహరణ రెండు రోజులుగా తాగునీటి కరువు! ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా చేయలేని పరిస్థితి.. ప్రజల ఇబ్బందులు పట్టించుకునేదెవరు? ఏ. నారాయణపురము 2 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి కే లాలు స్వామి నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – ఏఎస్పీ సౌజన్య కోనంకి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా జొన్నలగడ్డ రేణుకాదేవి తొలి నామినేషన్ బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు  ఆస్కార్ రేసులో నిలిచిన కొరియన్ మూవీ పాసిబుల్ లవ్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ మామదాపూర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు పాలకోడేరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా చింతలపాటి శివ నాగరాజు నామినేషన్ టీడీపీలో సుదీర్ఘకాలంగా అందించిన సేవలకు గుర్తింపుగా అవకాశం అశ్వారావుపేట మండలంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం — పోలీసుల దర్యాప్తు కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడే! డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం

ఏకగ్రీవంగా తీర్మానించిన వీర మహిళలు - మేయర్ అభ్యర్థి జయశ్రీకి మహిళా లోకం జై

Select Suryaa Now
 ఏకగ్రీవంగా తీర్మానించిన వీర మహిళలు - మేయర్ అభ్యర్థి జయశ్రీకి మహిళా లోకం జై

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    నెల్లూరు మేయర్ పీఠం కోసం బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి ఎన్. జయశ్రీకి మహిళా ఓటర్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.  బుధవారం నగరంలోని బీబీ నగర్, లిటిల్ హాట్ గెస్ట్ ఇన్ నందు నెల్లూరు రూరల్, సిటీ కమిటీ వీర మహిళా నేతల అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యావంతురాలు, తోటి మహిళ అయిన మేయర్ అభ్యర్థి ఎన్. జయశ్రీని మహిళా నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం నెల్లూరు నగరంలోని మహిళా ఓట్లన్నింటినీ 'బీరువా' గుర్తుకే వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు.  "ఆడవారి కష్టాలు ఆడవారికే తెలుస్తాయి. మనలో ఒకరైన జయశ్రీని గెలిపించుకుంటేనే నెల్లూరులో అమ్మ పాలన వస్తుంది" అని మహిళా నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు, జిల్లా కమిటీ ఇన్చార్జి అధ్యక్షులు వెండిపల్లి శ్రీనివాసులు, నంద్యాల జిల్లా అధ్యక్షులు బి మహేష్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షురాలు ఆర్ విజయలక్ష్మి, నెల్లూరు రూరల్ అధ్యక్షురాలు ఏ. అమ్ములు, నెల్లూరు నగర అధ్యక్షురాలు శైలు, బీబీజాన్, పద్మా రెడ్డి, అమ్ములు, మహిళా కమిటీ కోశాధికారి శిరీష, నాగేశ్వరమ్మ, షేక్ కౌసర్, మండల కమిటీ అధ్యక్షురాలు కె శశికళ, ఎస్.కే ఫర్ మీ, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.