BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

19 ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ..

Select Suryaa Now
19 ఎంపీటీసీ స్థానాలకు కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ..

పొదలకూరు,  మేజర్ న్యూస్ :     : పొదలకూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఊపందుకుంది. మండలంలోని మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 10 ఎంపీటీసీ సెగ్మెంట్లకు తెలుగుదేశం పార్టీ తరఫున 14 మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 9 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) వెల్లడించారు. ఇరు పార్టీల నుంచి కలిపి మొత్తం 23 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.ఒకే పార్టీ నుంచి పలువురు ఆశావహులు నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో మండల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుందని ఆర్వో తెలిపారు. 24వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన (స్క్రూటినీ), 25వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని వివరించారు.నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాపై స్పష్టత రానుంది. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య పెరుగుతుండటంతో మండలంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.