BREAKING
రూ. 120 కోట్ల రెవెన్యూతో రికార్డు సృష్టించిన సమంత సుగంధ ద్రవ్యాల బ్రాండ్ ఎనిమిది నెలల్లో అద్భుత వృద్ధి శమీ పూజ లో పాల్గొన్న సాయిబాబా దంపతులు స్థానిక ఎన్నికల్లో ఆరు మండలాల్లో కాంగ్రెస్ పోటీ ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు సాధువెల్లిలో వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవం సూర్య కథనానికి స్పందన.. క్రాస్ రెగ్యులేటర్ గేట్లు మూసివేత ఘనంగా దుర్గామాత విగ్రహాల ఊరేగింపు.. ఘనంగా మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు బోధన్‌లో ప్రారంభమైన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు చెంపపెట్టు ముమ్మరప్రచారంలో డాక్టర్ షకీలా భక్తిశ్రద్ధల నడుమ అమ్మవారి నిమజ్జనోత్సవం ఘనంగా ముగిసిన దసరా ఉత్సవాలు.. కోలాహలంగా శోభాయాత్రలు ఘనంగా రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు మున్సిపల్ అభివృద్ధిని చూడాలి చిరు వ్యాపారాన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు

రాజరాజేశ్వరిగా కామాక్షిదేవికి పూజలు

Select Suryaa Now
రాజరాజేశ్వరిగా కామాక్షిదేవికి పూజలు

సిఎస్ పురం,మేజర్ న్యూస్,,విజయదశమి పండుగను పురస్కరించుకుని జరుగుతున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం  మండలకేంద్రమైన సిఎస్ పురంలోని మహిమాన్వితమైన అతిపురాతన శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా సందర్భంగా శ్రీకామాక్షి అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరిదేవిగా అలంకరణ చేసి పూజలను దేవస్థానం అర్చకులు కొల్లిపరశ్రీకృష్ణశర్మ వైభవంగా పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వర స్వామివార్లకు పంచామృత అభిషేకం పూజలు నిర్వహించి అనంతరం పట్టువస్త్రాలు పూలమాలలతో ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు చేశారు.దసరా పండుగను పురస్కరించుకుని దేవస్థానం ఆవరణమంతా పూలమాలలతో అందంగా అలంకరించారు.ఈసందర్భంగా కామాక్షి అమ్మవారిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరణ చేసి కుంకుమార్చన విశేషపూజలు నిర్వహించారు. అదేవిధంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు ఉభయదాతలచే నవగ్రహమూర్తులకు కళశాలకు ప్రత్యేక పూజలుచేసి అనంతరం దేవస్థానం ఆవరణలో మేళతాళాలు భక్తుల దేవీనామస్మరణతో అత్యంత వైభవంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి తదుపరి భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. సాయంత్రం రాజరాజేశ్వరిదేవి అలంకరణలో ఉన్న శ్రీకామాక్షి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ప్రతిష్టించి శమీపూజ నిర్వహించి అనంతరం భక్తుల దేవీనామస్మరణల మధ్య మేళతాళాలతో దేవస్థానం నందు ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పించి కర్పూరహారతులు ఇచ్చి తీర్ధప్రసాదాలు అందజేశారు. దసరా సందర్భంగా దేవస్థానం ఆవరణ భక్తులతో భక్త జనసందడి నెలకొన్నది. ఈసందర్భంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి కామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.