శమీ పూజ లో పాల్గొన్న సాయిబాబా దంపతులు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రులలో భాగంగా స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శమీ పూజ ను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వాసవి అమ్మవారి దేవాలయం అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా-లక్ష్మీపార్వతీ దంపతులు శమీ పూజను నిర్వహించారు. పూజాక్రతువును కూరపాటి సుధాకర్ శర్మ, చరణ్ సాయిలు జరిపించారు. అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.