సూర్య-నవీపేట్ ;దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉత్సాహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపాలలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాల వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గామాత ఉత్సాహ విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు జన్నెపల్లి గ్రామంలో బుధవారం దుర్గమ్మ ప్రతిమలను యువకులు, మహిళలు, చిన్నారులు నృత్య ప్రదర్శనలు, భక్తిశ్రద్ధలతో పోలీసు బందోబస్తు మధ్య వీధుల గుండ ఊరేగించారు. అనంతరం తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న దుర్గామాత విగ్రహాలను నిమజ్జనానికి తరలించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఉత్సాహ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.