BREAKING
నాగలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమం మార్కో జాన్సెన్ ఆల్‌రౌండ్ వీరవిహారం: 60 ఏళ్ల రికార్డు బ్రేక్, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జోరు! విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ అమరుల త్యాగాలు పోలీసులకు స్ఫూర్తి: సైబరాబాద్ సీపీ డా. యం. రమేష్ బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం గరివిడి లక్ష్మి చిత్రంలో సత్తిబాబుగా రాగ్ మయూర్ అద్భుత నటన: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మేకోవర్! 32వ డివిజన్ కూటమి అభ్యర్థిగా కౌసర్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు కూటమి అభ్యర్థి ఉమామహేశ్వరి విజయానికి కరాటం రాంబాబు, శేషు ప్రచారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో.... ఘనంగా శమీ పూజ, రావణ దహనం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో రమణ 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు: 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్ పాతబస్తీలో బతుకమ్మ నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు లేక మహిళలకు ఇబ్బందులు పోలీసులు ఫ్లాగ్ మార్చ్

మున్సిపల్ అభివృద్ధిని చూడాలి

Select Suryaa Now
మున్సిపల్ అభివృద్ధిని చూడాలి

మున్సిపల్ అభివృద్ధి చూడాలి 
--జరుగబోయే ప్రగతిని గమనించాలి 
--కూటమి అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చాలి 
--కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి 
– మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య : ఆత్మకూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో, ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 28 వార్డుల అభ్యర్థులతో పాటు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి ఆయన స్వయంగా బీ-ఫారాలను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూమున్సిపల్ ఎన్నికలను కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. కూటమిలోని అన్ని పార్టీల నాయకులు సమన్వయంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలనిపిలుపునిచ్చారు.
ఆత్మకూరు పట్టణఅభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యాలుగా అభ్యర్థులు పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల నమ్మకాన్ని పొందేలా ప్రతి అభ్యర్థి తన వార్డులో ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యతను చాటాలని, వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగాలని మంత్రి ఆనం స్పష్టం చేశారు. ప్రతి వార్డులో ప్రజలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, కూటమి అభ్యర్థుల తరఫున సమన్వయంతో ఎన్నికల కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.

ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి సమష్టి కృషి అవసరమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఈ రెండేళ్లలో ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని చూడాలని, రానున్న రెండేళ్లలో జరుగనున్న అభివృద్ధిని గమనించాలని, కూటమి అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చాలని మంత్రి ఆనం కోరారు. పదేళ్లుగా ఆత్మకూరు అభివృద్ధిని పట్టించుకోని ప్రతిపక్షం ఓట్లను అడిగే హక్కేలేదని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యువ నాయకుడు, మున్సిపల్ తెలుగుదేశం చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తనయుడు బొమ్మిరెడ్డి తారక్ నాధ్ రెడ్డి,పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం లీలా కైవల్యా రెడ్డి, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, మండల టిడిపి అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి, నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కేతా విజయభాస్కర్ రెడ్డి, ఆత్మకూరు మాజీ మండలాధ్యక్షుడు కేతా వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు అబ్బూరు రమేష్ నాయుడు, కంచర్ల మాధవి, మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి తోడేటి వెంకటయ్య,మాజీ కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి,పొడమేకల పెంచలయ్య యాదవ్, షేక్ రేష్మ,ఆత్మకూరు మున్సిపాలిటీకి కౌన్సిల్ అభ్యర్థులుగా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, తెలుగుదేశం క్లస్టర్ ఇంచార్జ్ లు తలచీరు బాబు నాయుడు, పి.సాగర్, బిజెపి సీనియర్ నాయకుడు కుడుముల సుధాకర్ రెడ్డి, పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.